పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

ద్విపదభారతము.

వడిఁ గూడఁ బోరియు వంతఁ బాఱియును
జడబుద్ధి మాఱియు సఖులఁ జీరీయును
నెత్తురు గ్రక్కియు నెరయఁ జిక్కియును
చిత్తంబు స్రుక్కి యుఁ జేష్ట దక్కియును
వీడిన వెస నేగి వీక్షించి వీరు
"లోడ కోడకుఁ" డని యొకలక్ష గూడి
కర్ణాదు లనుప నగ్గలికతో వచ్చి
యర్ణవధృతి తోఁప నందంద యార్చి
నరుమీఁద నేసిన నరుఁడు భీతిలక
దరహాస మెసఁగ ను త్తరున కిట్లనియె:

అర్జునుఁ డుత్సాహవచనంబు లాడి యుత్తరుని యుద్ధసన్నద్ధుఁ జేయుట.


"ఓరాజనందన, యుద్ధంబు బలిసె.
సారథ్యమునకు వేసఱకుమీ నీవు.
ఈ సేనఁ జొచ్చిన నింకఁ బై రాదు;
భాసురగతిఁ దేరుఁ బాఱ ని" మ్మనిన
మెలపుతో నతఁడును మిఱ్ఱుపల్లంబు
తలఁపఁ జేరువయును దవ్వు దుర్ఘటము
నొక్క సమాన మై యుండ నారథము
నెక్కుడు వెసఁ దో లె నెల్ల సేనలును