పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

256

ద్విపదభారతము.

మఱి కొంద ఱుత్తుంగమాతంగసమితిఁ
దఱచు డీకొల్పుచుఁ దగఁ బార్థుమీఁదఁ
బరిఘముద్గరకుంతబాణనా రాచ
కరవాలశూలచక్రము లొప్ప వైచి
కుంభజుతోడ మార్కొనినవారిధుల
జృంభణ మె ట్లయ్యెఁ జెలఁగి య ట్లయిరి.
రథికులు కొంద ఱూరక చిత్తజల్లు
పృథివీధరంబుఁ గప్పినరీతి దోఁప
బెడిదంపుఁ దూపుల బీభత్సుఁ గప్ప
బెడబెడ మనియార్చి వే పొయి మఱియుఁ
బురములు మూఁడు గోపురములతోడ
హరుచేతఁ బడినట్ల యతనిచేఁ బడియుఁ
జౌకళించుచు రాజసమితితోఁ గొంద
ఱాకీర్ణ శరఖడ్గు లై వచ్చి తాఁకి
హేషారవంబుల నిద్ధకింకిణుల
రోషభాషణముల రొద చేసి కప్స
శబ్దభేదులు కొన్ని సంధించి యప్పు
డబ్దవాహనపుత్త్రుఁ డస్త్రంబు లేయ
నాతత బాణాగ్ని యలమ నందఱును
ఊతగా నశియించి రొగిఁ జూడ నపుడు.