పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము-ఆ-రా

255

నిలువక కలనిలో నెత్తుటఁ దోఁగి
యలమి సైన్యము నెల్ల నదలించి మించి
పంచాననంబులపగిది నేనుఁగుల
జించి మాంసంబులఁ జిద్రుపలై రాల్చి
జననాధులను బోలె శాస్త్రసమ్మతుల
ఘనహస్తపదమస్తకముల ఖండించి
యురవడి నుగ్రవాయువుల చందమున
నరదంబులొక కొన్ని హతము గావించి
కాఱెనుమునుబోలె గతి నేపు రేఁగి
మీఱి వైరులు నెల్ల మెఱయంగఁ ద్రుంచి
జలజనాభునిమూర్తిసంపత్తిపోలెఁ
దలఁప నెక్కడ నైనఁ దాన యై యుండె.
అప్పుడు సైన్యంబు లాయోధవరులు
తప్పక నరుమీఁద దట్టమై కదిసి
జలధిపైఁ గవిసిన చటులాగ్ని సమితి
పొలుపున రూపఱి పోవ నన్నియును
బరఁగ వాలమ్ములు వర్షించి తాఁకి
యరుదార నిరుగేల నాలంబు సలుపు
సురరాజసుతుని యాశుగవేగమునకుఁ
బరువిడి నిలువ నోపక పాఱి పోవ