పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

ద్విపదభారతము.


వైరీ సైన్యముఁ జొచ్చి వారు వీరనక
ఘోర శరాగ్ని గగోలుగాఁ బఱిచి
కదిసి పాఱగ నొక్కకాలంబునందుఁ
బదియింటఁ బదియింట భటపొర మేర్చీ,
త్రిదశులు బెదర నుద్రే కించి యార్చి
కదనంపుఁగ్రీడలోఁ గడుదిట్ట యగుచుఁ
దలక క మార్కోన దమకించుపొరిఁ
దొలుతను జెండాడి తోడ్తోడ భటులు
భంగంబుతోఁ బటాపంచ లై పాఱ
ముంగలి మొనవారి మొత్తి పోఁ ద్రోలి
శింజినీ నాదంబు సింధుగర్జనము
రంజిల్లుగతి నొక్కరవముగా మొరయ
దళముల పై దేగుఁ దఱిమించి మించి
కొలను సొచ్చిన యట్టికుంజరం బనఁగ
బంధుర గాండివపటు మౌర్వియందు
సంధించి యేయుచో శరపరంపరలు
పదియు నూఱును వేయి పదివేలు లక్ష
పదిలక్షులును గోట్లు పదిగో ట్లనంగ
మెఱసి లెక్కకు మిజి మిణుఁగుర్లు చేదర
నెఱమంట గ్రక్కుచు నేచి వేగమున