పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము---ఆ-4

233

క్షితినాధు నిదె సురక్షితము సేయుదుము.
ప్రతివీరులకు బాహుజలము సూపుదుము.
జననాధుఁ డనెఁ 'గ్రీడి సమయంబు దాఁటె
నని కిట్లు వచ్చుట' నది విచారించి
భీష్ముఁ డుత్తర మిచ్చుఁ బ్రియముతో" ననుడు
భీష్ముఁ డిట్లని పల్కెఁ బృథివీశుఁ జూచి

సమయము గడచియె నరుఁడు పొడసూపె నని భీష్ముఁడు నిర్ణయించుట.


"అధిక మాసములు రెండవయేట వచ్చె
నధిప పాండవు లిట్టు లవి యెల్లఁ జూచి
పుడమి మెచ్చఁగఁ బదిమూఁడవయేఁడు
కడమ నిండించిరి ; కాన రే మీరు?
సమయంబు నిండక చనుదెంచుపనులు
యమసూతి సేయింపఁ డనుజులచేత .
ఆపాటివా రైన నాస్థానసీమ
ద్రౌపది మీ రట్లు తల పట్టి యీడ్వఁ
గనియు నూరక యుంట కటుధర్మ పాశ
మునకు లోబడి కాలమును వేచి యుంట
కని యేల తెలియ? రయ్యాభీలశౌర్య
ధనులు నాఁడె తఱియఁ దాఁకిన మిమ్ము