పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

ద్విపదభారతము.

నరిముఱి జక్కాడి యమలోకమునకుఁ
దెరువు సూపర? మీకుఁ దెలివి డీల్వడియె!
వా రింత కాలంబు వనభూమి దిరిగిఁ
వారక యజ్ఞాతవాసకష్టములు
తాలిమి నోరిచి తమపూన్కి నెఱపి
వాలినకోపాగ్ని బజ్వరిల్లఁగను
గ్రూరు లై యున్నారు కురువార మనఁగ.
ఏరీతిఁ జూచిన నెద భీతి యడరు.
నటు చూడు మర్జునుఁ డరుదెంచినాఁడు.
నిటులాక్షు గెలిచినెఱవాది వాఁడు.
ఇంతశూరుని గెల్తు నిపు డంచుఁ బలికి
పంత మాడఁగ రాదు ; భాగ్యంబుకొలఁది.
కా దని యని సేయఁగాఁ జెప్పినట్లు
రాదు మేలును గీడు రణశూరునకును.
సంధి సేయుట మేలు సకలభాగ్యములు
సంధించుఁ గా కింత చల మేల మనకు ?"

సంధి పొసంగ దని దుర్యోధనుఁడు భీష్మునకుఁ దెలుపుట.


అనిన సుయోధనుం డాభీష్ముతోడ
“వినవయ్య నే నెన్ని విధముల నైన