పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

ద్విపదభారతము.

కోని యాడుదురు శత్రుకోటుల నైనం
బని మోఁచు నప్పుడు దోర్బలము చూపుదురు
ధరణిఁ బెద్దలజాడ తొ 'నేమి యెఱుఁగు ?
సురలవై వేద్యంబు శుసక మే మెఱుఁగు?
అని చెప్పి గాంగేయుఁ “డాచార్యుల గృపుని
ఘను ద్రోణ నందనుఁ గడు వేఁడికొనుము.
పని చాలఁ గలదు బీభత్సుఁ డే తెంచె !
మనలోన మన కింత మత్సరం బేల ?
కడుకొని యన్యోన్యకలహంబు మాని
తోడఁగుఁడు బీభత్సు దురములో గెల్వ"
అని చెప్పి గాంగేయుఁ డా రాజుం తోడ
“ బనివడి ద్రోణునిఁ బ్రార్థింపు మిపుడు
విను మాతఁ డెఱుఁగు నావివ్వచ్చులావు"
అనిన దుర్యోధనుం డపుడు తా లేచి
యల భీష్ముఁడును గర్జుఁ డనుగమింపఁగను
గలశజుఁ బ్రార్థింపఁ గనలు పో విడిచి
పరి వేషనీర్ముక్త పద్మారి బోలి
వరదుఁ డై ద్రోణుండు వల నొప్పం బలికె:
మా నేఁ గోపము భీష్ము మాట విన్నపుడే.
ఏ నేల కోపింతు నిట్టి కార్యమున ?