పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

ద్విపదభారతము.

గోపొగ్ని బాణాగ్ని గూడ మైకొలిపి
చా పద నాలావు చూూడుండు మీరు,
అదె క్రీడి పదిమూడుహాయనంబులకు
వదలక తనదుసత్త్వము జోక చేసి

ధృతి బూచిపట్టి యేతెంచె;మీ రతని
జితలోకు డని పెద్ద నేయు చున్నారు!
ఏనును బంటనే హితబుద్ధితోడ
నీన రేశ్వరుసొమ్ము హితముగాం గుడిచి
గాండీవి గెలిచినం గానికా దనుచు
నుండితి నున్నందు కొదవెం గయ్యాంబుం
అతనినాలోని యీయధికత్వ మెఱుగ
ధృతిం గోరుజనులసం దేహంబు మాన్ప
రమణతో జమదగ్ని రాము చే గన్న
యమితశ శాస్త్రాస్త్ర విద్యలు విస్తరింతు.
మొగి సారసత్త్వులమొన వాడినేయు
పగిది నర్జును నంత ప్రన్తుతింపకుండు.
హైపచారమె కాని పౌరుషంబునను
ఆపార్ధు డేమికార్యము సేయ నోపు!
గోవుల వెంటం జేకొని మీరు గూడ
బోవుట మేలు గుంపులు గూడి యనిన