పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము---ఆ-4

227

అది యెన్న నేల మీ రందఱుఁ గూడి
పదిల మైయరుదెంచి పసులఁ బట్టినను
ఎలమితో నుత్తరుఁ డిట వచ్చె నేని
తలపడి పోరాడఁ దగుఁ గాక తప్పి
కౌంతేయుఁ డరుదెంచెఁ గడఁగి యవ్వీరు
చెంతఁ జేరెడివానిఁ జెప్పు మీ" వనిన

కర్ణుఁ డర్జునునిఁ దా గెలిచెద నని వీరాలాపంబు లాడుట.


నంతయు విని కర్ణుఁ డతని కిట్లనియె:
“కౌంతేయు నిర్జింపఁగా నేను గలను.
పనుపడి మీ రేల పాండునందనులఁ
గనుఁగొన నిటు వచ్చి కౌంతేయుఁ జూచి
చలమునఁ బోరాడ సన్నాహపడక
పలుమాఱు నావీరుఁ బ్రస్తుతించెదరు?
ప్రకటింప మీరలు పొలుపోఁ దొలఁగుఁ
డొకని కొక్కఁడ చాలు యుద్ధంబు సేయ.
కవ్వడిచాపంబుఁ గపి కేతనంబు
దవ్వులఁ ద్రుంచి యాతని నాక్రమించి
సప్తాంబురాసులు సప్తశైలములు
నవలోకంబులు సంచలింపఁగను