పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము---ఆ-4

229


గిలకిల మని నవ్వి కృపుం డొప్పం బలికెం
పలుక నేర్తువు కర్ణ బహుభాషణములు!
పలుకు మాత్రమే కాక పలికినయంత
నిల వారు చేసిన నే నెమి గాదు!
కవ్వడి నిర్జింపం గలవు నీ వనిన
నెవ్వడు నమ్ము? ము న్నెఱుగమే నిన్ను?
గాండీవి ద్రౌపదిం గైకొన్న నలిగి
మెం డైననృపు లెల్ల మెజసి పోరాడి
యతనిచే గజిబిజి యై పోవునాండు
జతన మై నీవు నచ్చటం బాఱ లేదె?
పతిభక్తి గల వని పరికింతుమేని
పతి యొన్న గంధర్వపతిచేతం జిక్కం
జేయ వైతివి లావు! చేతులు కూరం
గోయం బోయెనె కర్ణ? కోపింప వలదు.
ఒంటే వచ్చిన క్రీఢీ నోర్తు నే నంటి
వొంటిమై: గాలకేయులం జంపె నితండు;
ఇండ్రాదిదివిజుల నితం డొంటి గెలిచెం
జంద్ర శేఖరు నొంటి సాధించె నితండు
చూచినవా రెల్ల జోద్యంబు నొంద
నేచి యాూదవ నేన నితం డొంటి గెలిచె.