పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

219

లలి నెక్కు వెట్టి మెల్లన ముష్టిఁ బట్టి
వల నొప్ప వరగుణధ్వని సేయుటయును
జెదరె నంబరవీధి శేషాహి వణఁకె
బెదరెఁ గౌరవసేన పృథివి యల్లాడె
గిరులు పాతరలాడెఁ గిటి సంచలించె
స్థిర మేది దిర్దిరం దిరిగె లోకములు.
అంతలో మఱియు నయ్యమరేంద్రసుతుఁడు
చింతించె నగ్ని యిచ్చినకేతనంబు.
అదియు మహోగ్ర మై యఖిలమాయలకుఁ
గుదు రై మహాభూతకోటులు గొల్వ
వానరాకార మై వచ్చి నిల్చుటయు
మానసంబున మోదమానుఁ డై నరుఁడు
చెలువారునుత్తరుసింహ కేతనముఁ
దొలఁగించి ప్లవగ కేతువు తేరిమీఁద
నెత్తించునంతలో నేతెంచి దేవ
దత్తంబు దోఁప నెంతయు సంతసిల్లె.
జగతీశసుతుఁడును సన్నద్ధుఁ డగుచు
నొగ లెక్కి హరులమేనులు పెద్ద నిమిరి
పగ్గంబు లాయత్తపఱచుచో నతని
యగ్గలికను జూచి యాక్రీడి పలికె: