పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

ద్విపద భారతము.

నస్త్ర దేవతలకు నతిభ క్తి మ్రొక్కి
శాస్త్ర క్రమంబున సంతోషపఱిచి
పురములు సాధింపఁ బోవు చున్నట్టి
పరమేశ్వరుఁడుఁ బోలెఁ బౌరుషంబునను
గోత్రారి యిచ్చినకుండలద్వయముఁ
జిత్ర మైనట్టియుష్ణీషంబుఁ దలఁచి
తప్పక రప్పించి తలచుట్టుఁ జుట్టి
యొప్పారఁ గుండలయుగళంబుఁ బూని
దివ్యాంబరముఁ జేర్చి దిండుగాఁ గట్టి
భవ్యాంగ రాగంబు పలుచగా నలఁది
యంకురించుచు నున్న హాసంబుతోడ
నంకులు ధరఁ గూల నందందు నొక్కె.
అప్పుడు మౌళిపై నయ్యర్జునునకు
నుప్పతిల్లినమాడ్కి నుదయార్కుఁ బోలి
చెన్నార నింద్రుఁ డిచ్చినకిరీటంబు
కన్నులపండు వై కాంతి నొప్పారె.
నరుఁ డంత రథ మెక్కి నానాస్త్రవితతు
లరదంబుపైఁ బెట్టి యతిసంభ్రమమునఁ
గవచశిరస్త్రాణకలితుఁ డై మెఱసి
కవదొనలును బూని గాండీవ మెత్తి