పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

ద్విపద భారతము.

"ఆలస్య మెంతయు నయ్యె నిచ్చోట
లే లెమ్ము పసుల మర్లింపఁ బో వలయు.
మెలవుమైఁ దేరు జమ్మికిఁ బ్రదక్షిణము
పొలుపారఁ చేయించి పోవ ని” మ్మనిన
నవనీశతనయుండు నట్ల కావించె.
దివిజేంద్రసుతుఁ డొత్తె దేవదత్తంబు;

నరుఁడు దేవదత్త మొత్త నుత్తరుఁడు భయభ్రాంతిఁ దూలుట.



ఆమహారవమున నంభోధి గలఁగె,
హేమాద్రిశిఖరంబు లిట్టట్టుఁ బడియె,
అద్రిజ భీతిల్లి హరుఁ గౌఁగలించె,
నిద్ర మేల్కని శౌరి నింగికై చూచె,
బలభేది వెఱచి గీష్పతివంకఁ గాంచె,
లలిఁ బద్మభవుఁడు కాలము నెన్నఁ జొచ్చె,
ఉత్తరుండును మూర్ఛ నొరగెను హరులు
నెత్తిన లేవ లే కిలమీఁదఁ బడియెఁ
బడిన వీక్షించి యాఫల్గునుఁ డంత
గెడప కశ్వముల వాగెలు పట్టి యెత్తి
వెన్నులు చఱచి వేవేగ నూల్కొల్పి
యన్న రేశ్వరపుత్త్రు నర్థితోఁ దెలిపి