పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

217

మఱవక మేనమామవు కాన నీవు
మెఱసి యొండడిగెద మెలపుతో నిన్ను
వదలక షండభావం బేల యపుడు
చెదలు పట్టినయట్లు సిద్ధించె నీకు ?
చెప్పవే యీమూర్తి శృంగారజలధి
యిప్పుడ నినుఁ బొందె నిది యేమి చోద్య?"
మనుటయు నర్జునుం డమరలోకమునఁ
దనర నుర్వశి మున్ను తన కిచ్చినట్టి
శాపప్రకారంబు సకలంబుఁ జెప్పి
యేపార నృపసూతి కిట్లనె మఱియు
"ఎలమితో నీ వింక నీజమ్మి నెక్కి
కలయఁ దనుత్రాణకంకటంబులును
గవదొనలును హేమకలితబాణములుఁ
దివిరి గాండీవంబుఁ దెమ్ము నా" కనిన
నమ్మహీరుహ మెక్కి యతఁడు గాండీవి
తె మ్మన్న యవి యెల్లఁ దివిచి యాక్షణమ
కడు నొప్పుతక్కటి కైదువు లెల్లఁ
గడఁకఁ దొల్లిటియట్ల కట్టగాఁ గట్టి
జమ్మిపై నిడి డిగ్గె జననాధతనయుఁ
డిమ్ముల నటఁ జూచి యింద్రనందనుఁడు