పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

216

ద్విపద భారతము.

ఏను మీఁ దెఱుఁగక యేమేనిఁ గొన్ని
కానిమాటలు నిన్నుఁ గడవ నాడితిని.
తప్పు లోఁ గొని నన్ను దయసేయు" మనిన
నప్పుడు బీభత్సుఁ డరదంబు డిగ్గి
యతనిఁ గాఁగిటఁ జేర్చి యాదరించినను
అతఁడును మోదించి యర్థి నిట్లనియె:
"మంచు విచ్చినయట్లు మనసులో నున్న
చంచలత్వము వాసె జయశీల వినుము.
నీ తేరు గడపుదు నెఱి నింద్రు తేరు
మాతలి గడపినమాడ్కిఁ గయ్యమున.”
అర్జునుఁ డిట్లను "నఖిలకౌరవుల
నిర్జింతుఁ గయ్యాన నిన్ను గుఱ్ఱములఁ
గాలియు సోఁకఁగాఁ గాని వైఖరుల
నోలిఁ గాచెదఁ జూడు ముత్తర యింక
నాలంబులో నీవు నశ్వరత్నములఁ
దోలుము పసుల రాఁ దోలుదు నేను.
అరయ మీపసు లెన్ని యన్ని యేనుఁగులు
కురురాజు మొనఁ జూఱఁ గొని తెత్తు నీకు."
అనిన భూమింజయుఁ డతని కిట్లనియె:
"విను నీవు చెప్పినవిధమె కావింతు