పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

213

ఉత్తర, ఫల్గుని నుదయింపఁగాను
గ్రొత్తగా దెపుడు ఫల్గునుఁ డండ్రు నన్ను .
పృథ యను పేరను బృథివి మాతల్లి
ప్రథిత యైనది కానఁ బార్థుండ నేను.
వెసఁ గిరీటము నాకు వేల్పుఱేఁ డీయ
వసుధఁ గిరీటి నై వర్తింతు; మఱియుఁ
దలఁప నా తేరున ధవళ వాహనము
లలరంగ శ్వేతవాహనుఁ డండ్రు నన్ను .
ప్రధితు లౌరిపుల బీభత్సు గావింపఁ
బృథివిలోపల నన్ను బీభత్సుఁ డండ్రు.
సమరాంగణంబుల శాతా స్త్ర తతుల
విమతవీరులఁ గూల్చి విజయుండ నైతి.
కలనిలో ధర్మజుఁ గారించునతనిఁ
జెలఁగి చంపుదుఁ గాన జిష్ణుండ నైతి.
దురములో రెండుచేతుల విల్లు దివియు
సరవిచేతను సవ్యసాచి నాఁ బొలుతు,
మునుమిడి రిపుధనంబులు చూఱఁ గొనఁగ
నను మహీజనులు ధనంజయుం డండ్రు.
ఈపదినామంబు లీవిధంబునను
బ్రాపించె నాకు; ధర్మజుసోదరునకు