పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

ద్విపద భారతము.

నఱిముఱిఁ గల్లల నాడ నేలయ్య ?
నెఱిఁ ద్రిశుద్ధిగా నమ్ము నే నర్జునుఁడను.
ఖాండవదహనంబు గావించి సురల
దండించునాఁడు నాదర్పంబుఁ జూచి
శ్రీకంఠుఁడును విరించియు వచ్చి మెచ్చి
నాకు నిచ్చిరి కృష్ణ నామధేయంబు ;
మఱి వచ్చి సుర లెల్ల మంత్రయుక్తముగఁ
దెఱఁ గొప్ప నిచ్చిరి దివ్యాయుధములు.
అవి సాధనములుగా నర్థితో నేను
దివిజేంద్రురథ మెక్కి దివ్యలోకముల
నవిరళసురవైరు లైననివాత
కవచుల గెలిచితిఁ గదనంబునందు.
ఇర వొంద సురగణాహితులు హిరణ్య
పుర నివాసకు లైసభూరి దానవులఁ
దెఱఁ గొప్ప భాగీరధీతీరభూమి
నఱువదివేవుర నందంద చంపి
నప్పుడు ప్రత్యక్ష మై కాదె వజ్రి
యొ ప్పార నిచ్చె నా కొకకిరీటంబు,
దేవసంఘముచేత ధృతిఁ బొందినాఁడ
దేవద త్తం బనుదివ్యశంఖంబు.