పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

ద్విపద భారతము.

"తనర నర్జునునకు దశనామకములు
వినఁబడు నవి నీవు వివరింతువేని
నెమ్మి నప్పుడకాని నీ వతఁ డగుట
నమ్మఁ బో" మనుటయు నరుఁ డొప్పఁ బలికె:

అర్జునుఁ డుత్తరునకుఁ దననామంబులు సకారణంబుగఁ దెలుపుట.


"కొలఁది నర్జునుఁడు ఫల్గునుఁడు పార్థుండు
చెలఁగి కిరీటియు శ్వేత వాహనుఁడు
వెలయ బీభత్సుండు విజయుండు జిష్ణుఁ
డిల సవ్యసాచియు నీధనంజయుఁడు
నన నివి పదిపేరు లాయర్జునునకు
ననుపమస్థితి నొప్పు” నన నుత్తరుండు
"ఈనామములు వాని కెట్టులు కల్గెఁ
బూని యొండొండఁ జెప్పుము విస్తరించి,
వంతున కిపుడు కవ్వడి నేన యనెద
వింతమాత్రమున కే నెట్లు నమ్ముదును !"
అనిన నించుక నవ్వి యగుఁ గాక యనుచు
వినిపింపఁ దొడఁగె నావిధ మర్జునుండు
"అర్జునవర్ణ మై యమర నాకీర్తి
యర్జున నామధేయము నాకు వచ్చె.