పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

211

వల్లభాదీపికాప్రథఁ గల్గుకృష్ణ
చెల్లఁబో తా నెందు సిలుగులం బడునొ ?
ఏ మని విందునో యేను నీ చేత !
ఏమి నీ వెఱిఁగిన నెఱిఁగింపు" మనిన
నాతనితోడ నిట్లనియె నర్జునుఁడు
"భీతి నొందకు వా రభేద్యవిక్రములు
ప్రీతితోడుతను బండ్రెండువత్సరము
లాతతవనభూములందు వర్తించి
జను లెఱుంగక యుండ సతితోడఁ గూడి
మనవీట నిపుడు నెమ్మది నున్న వారు.
పరికింపఁ గంకుండు పాండవాగ్రజుఁడు,
వరుస నావలలుండు వాయునందనుఁడు,
మరుఁ బోలువాఁడు దామగ్రంధి నకులుఁ,
డరయఁ దంత్రీపాలుఁ డతనిసోదరుఁడు,
మాలిని పాంచాలి; మఱి నీకు బొంక
నేల? యుత్తర విను మే నర్జునుండ,
మాలినికై కాదె మనభీమ సేనుఁ
డాలానఁ గీచకు నణఁచి చొప్పణఁచె,11
అనిన భూమింజయుం డాశ్చర్య జలధి
మునిఁగి తేలాడియు మోదించి పలికె: