పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

197

మరల కుండుట గాదు మరలింపు తేరు.
తిర మొప్పఁ బ్రాణంబు తీ పన విన వె?"
అనినఁ గవ్వడి మందహాసంబు చేసి
గొనకొని తా రాచకొడుకున కనియె:
"ఈ సైన్యముల మీఁద నే నేల పోదు ?
ఆసమీపంబున నదె చూడు పసులు;
పరికింప నచ్చోటఁ బస లేదు సేన,
పరువడి నటఁ బోయి పసులఁ బట్టెదము.
పౌరులు దీవింపఁ బణఁతు లుప్పొంగఁ
దే రెక్కి పసుల కేతెంచితి విపుడు
మొనకు భీతిల్లుచు ముగ్ధతన్ దిరిగి
చనిన నాడిక గాదె జగతిలోపలను ?"
అనినగాండివికి ని ట్లనియె నుత్తరుఁడు
"మనుజు లాడిన నేమి మాన్పంగఁ దరమె;
మును సముద్రము మూయ మూకుడు గలదె?
విను మేను గోవుల విడిపింపఁ జాల ;
పరరాష్ట్రముల నైనఁ బసులకుఁ బసుల
నిర వొప్ప సాధింతు, నివి యేల నాకు ?"
అనిన నుత్తరుతోడ నాక్రీడి పలికె
"మనసు జాఱఁగ నీక మఱి వెలఁ బోక