పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

ద్విపద భారతము.

ధీరత నిల్చి యుద్వృత్తి నేమఱక
భేరిభాంకృతి విని బెదరి లోఁ బడక
రణము గెల్చినఁ గాక రాజసూనులకు
గణుతింప నూరక కలుగునే కీర్తి ?”
అనిన భూమిజయుండు నమ రేంద్రపుత్రుఁ
గనుఁగొని పల్కె సంగము చంచలింప
"జనపాలకుఁడు నిన్న సకలసైన్యములు
గొనిపోయె రిపురాజకోటి నిర్జింప.
మనకుఁ దో డెవ్వరు, మనలావు లెంత !
మనకుఁ గర్ణుఁడ చాలు మనలావు గలఁప !
జను లెల్ల నవ్వ నశక్తజృంభణము
మనకుఁ జేయఁగ నేల? మరలు నీ" వనినఁ
బలికె నర్జునుఁ డంతఁ "బసులు రా కున్న
వల నొప్ప మరలనివ్రతము నావ్రతము.
కురురాజు గానిమ్ము గురుఁడు గానిమ్ము
సురరాజు గానిమ్ము సొరిదిఁ దాఁకుదము.
సైరంధ్రి ననుఁ బిల్చి సారథ్యమునకుఁ
బ్రారంభ మొనరించి ప్రార్థించె మొదల :
అది గాక గెల్చి ర మ్మని పౌరజనులు
ముదముతోఁ జల్లిరి ముత్యాలసేస ;