పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

ద్విపద భారతము.

భావించి నిస్సాణపటలంబుచేత
గోవులరొదచేత ఘోషితం బగుచు
నలుగుల మెఱుఁగుల నఖిలదిక్తటులఁ
గలిగి మేఘమువోలెఁ గర మొప్పుదానిఁ
గని యెంతయును భీతిఁ గంపించి మఱియుఁ
దనువెల్లఁ బులకింప ధైర్యంబు డించి
వెఱపింపఁగాఁ బోయి వెఱచినయట్లు
పిఱికి యై నరుఁ జూచి ప్రియ మొప్పఁ బలికె
"రథముఁ బో నీకు సారథి నిల్పు నిల్పు ;
పృథివిలోఁ గురుసేన భేదింప వశమె?
వాఁడె కౌరవభర్త వాఁడె భీష్ముండు
వాఁడె యశ్వత్థామ వాఁడె ద్రోణుండు.
అతఁడు కృపాచార్యుఁ డతఁడు కర్ణుండు
చతురులు మీ రెల్ల సంగ్రామమునను,
తగరును గొండయుఁ దాఁకె నన్నట్లు
తగ వేది వీరితోఁ దాఁక నోపుదు నె?
బాలుండ నొక్కండఁ బ్రౌఢులు వారు
వేలసంఖ్యల మీఱి వెలయు చున్నారు,
వీరి మార్కొన నేల విరిగి పో నేల ?
ఈరీతి నెఱుఁగక యేను వచ్చితిని ;