పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

ద్విపద భారతము.


"ఉత్తర మనయూరియు త్తరంబునను
గ్రొత్తగా నిదె నేఁడు కురుసేన వచ్చి
గోగణంబులఁ బట్టి కొనిపోవ దొడఁగె;
నీగుణంబులు లావు నేఱుపుదు కాక;
అరదంబుఁ దెప్పింపు, మతిశీఘ్రగతుల
ధరియింపు కవచంబు, ధనువుఁ దెప్పింపు
మాజికి; బలవంతు లగువారితోడ
రాజు వర్ణించు నీరణకళా కేళి.
దానికిఁ దగ వెంటఁ దగిలి గోగణముఁ
బోనీక మగిడించి పొరివుచ్చు మరుల.
నరుఁ డొక్కరుఁడు గాని నరనాధతనయ
కురుసేన నొరుఁడు మార్కొన లే! డ టన్న
యామాట బొంకుగా నాకౌరవులను
నీమగఁటీమిఁ జూపి నెఱి గెల్వు ; మంత
సుత్తరుబలము లోకోత్తరం బనుచు
వత్తురు నినుఁ జూడ వసువతీజనులు."
అని యంగనల చెంత నగ్గించి యతఁడు
తనుఁ బెద్ద సేయ నుత్తరకుమారుండు
"వా రెంత, నే నేంత! వలదు పొ" మ్మనక
కౌరవసేనతోఁ గాలు ద్రవ్వుచును