పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

185


ఇచ్చలో నివి యెల్ల సిగ్గుగాఁ గొనక
వచ్చి కౌరవసేన వడి మీఱ నార్చి

మత్స్యపుర ముత్తరదిక్కునందలిగోవులఁ గౌరవులు పట్టుట,

పొలుపు మీఱినమత్స్యపురిసమీపమున
బలిమి నవ్విరటునిపసులఁ బట్టుటయుఁ
గలగొల్ల లెల్ల నొక్కట మూఁక లగుచుఁ
దలపడి ఘోర యుద్ధము సేయునపుడు
కర ముగ్రముగ భీష్మ కర్ణ వికర్ణ
గురుకృపాశ్వత్థామకురురాజు లపుడు
బాణజాలము లుచ్చి పాఱ నేయుటయుఁ
బ్రాణభీతిని నోడి పాఱి గోపకులు
కౌరవ సైన్యంబుగా నిశ్చయించి
యారవారముతోడ ననుదెంచునప్పు
డతివీరుఁ డొకఁడు గవాక్షుఁ డస్వాఁడు
శ్రీ తినాధునగరి వాకిటఁ దేరు డిగ్గి
తత్తఱం బెసఁగ నంతః పురంబునకు
నుత్తరునకుఁ జెప్ప నొప్పారఁ బోయి
యతని పాదములకు నర్థితో మ్రొక్కి
యతులితం బైన దైన్యముతోడఁ బలికె: