పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

187

మెలఁతలు తనుఁ జూచి "మేలు మే" లనఁగఁ
బలికె గర్వించి గోపకుల వీక్షించి:

కౌరవులు పసులం బట్టుట విని యుత్తరుఁ డంతఃపురమున వీరాలాపము లాడుట.


"పొద పొద గోవులు పో నెట్లు వచ్చు?
ఇదె వచ్చు చున్నాఁడ నేఁ గయ్యమునకు.
కురుసేనపని యెంత, ఘోర బాణములు
గురిసినఁ జూలు సంక్షోభింప వలదె?
సారథి దొరకఁడు సంగ్రామమునకు
నేరూపమునఁ గాని, యేమి చేయుదును?
కడుకొని వెదకుఁ డెక్కడ నైనఁ గాని
కడచి గోవులు దవ్వుగాఁ బోకమున్నె '
ఈవేళ నే నుండి యింత కార్యంబుఁ
గావింప కున్న భూకాంతుఁ డే మనును ?"
అనుటయుఁ బాంచాలి యచ్చోట నుండి
మనుజేంద్రసుతుఁ డాడుమాట లాలించి
వచ్చి యంతయును వివ్వచ్చుతో ననిన
నిచ్చలో నపుడు దేవేంద్రనందనుఁడు
వడి నెన్ని యజ్ఞాతవాసవత్సరము
కడచుట యెఱిఁగి యాకాంత కిట్లనియె: