పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

ద్విపద భారతము.


మిక్కిలియును శాంతి నీమూర్తి యైన
నెక్కడ నేర్చితి వీసాహసంబు ?
కలహలీలాప్రౌఢిఁ గనుఁగొన్న యపుడు
వలలునంతటివాడు వసుధలో లేడు.
కలశజుపరిపాటి గాఁడె యామేటి
గెలిపించె నన్ను నక్షీణసాహసుఁడు.
మఱియును మాకు దామగ్రంధి నేఁడు
మెఱయఁ జేసినలావు మితి మేర గనెనె !
కడువేడ్క నాతఁ డఖండ విక్రముఁడు
జడియక వైరులఁ జంపె నొప్పార.
ధీభవ్యుం డైనతంత్రీపాలుఁ డొకఁడు
శోభన మొప్ప న న్నుతులతోఁ గూర్చె.
మనసేన నెవఁ డైన మహితవిక్రమము
తనర యుద్ధము సేయఁ దలపడె నొక్కొ :
చెలి కెందు నెడ రైనఁ జేరి ప్రోవంగఁ
డలపోయువాఁడె పో ధర నుత్తముండు.
తరుణు లశ్వములును ధనము వస్తువులు
గరులు గ్రామంబులుఁ గనకభూషణము
లడుగుఁ డిచ్చెద నంటి నభిమతం" బనినఁ
దడయక విభుఁ జూచి ధర్మనందనుఁడు