పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-3

181


“ఇచ్చెద ననుమాట యివుడు మాచోట
నొచ్చె మైనది మీకు నుర్వీశ వినుము.
ఇన్నియు నిచ్చుట యీత్రిగర్తేశు
మన్నించి సేనతో మరల నిచ్చినను.
చాటంగఁ బంపుమీ జయము సేమంబుఁ
బాటించి మనమత్స్యపట్టణంబునకు."

కంకుభట్టువేఁడికోలుచే విరటుఁడు త్రిగర్తాధిపుని విడిచిపుచ్చుట.

అనుటయు వాని సైన్యముతోడ విడిచి
జననాధుఁ డపుడు సుశర్మ వీడ్కొలిపి
కాలరి నొకని నక్కడ మత్స్యపురికి
మేలువార్తలు దెల్పి మెలపు ననిచె.
అనిచిన వాఁడును ననిలవేగమునఁ
జని మత్స్యపుఁ జొచ్చి జయము చాటింపఁ
బురజను లెల్ల నద్భుత మంది యపుడు
పురము శృంగారింపఁ బురవీధులందుఁ
గస్తూరి నలికించి కమ్మపూసరులు
ప్రస్తుతి నిలిపి తోరణములు గట్టి
పుణ్యగంధంబులుఁ బుణ్యవాదములుఁ
బుణ్య చేష్టలుఁ గల్గి పురలక్ష్మి వెలయ