పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-3

179




నతఁడు నానందించి " యా ధర్మజునకు
నతిగౌరవము మీఱ నర్థి నిట్లనియె:
« ఓ కంకు భట్ట మీ కరొనగూడి యిపుడు
మాకుఁ జేసినమేలు మఱవంగ రాదు.
తగినమీచేతకుఁ దగినట్టి మేలు
మగుడఁ జేసెద మన్న మాచేతఁ గాదు !
కాకున్న నేమి సౌఖ్యమున మాపదవిఁ
గైకొని మాకోర్కి గావింపు మయ్య,
ఈయొడ లీలక్ష్మీ యీమానధనము
నీయిచ్చినవి కాన నీ కిత్తు మగుడ.
ఎలమీతో మిముఁ గొల్వ నిహపరోన్నతులు
గలుగు నంతియె చాలు గణుతింప మాకు.*
అనుటయుఁ బ్రియ మంది యాధ ర్మజుండు
మను జేంద్రుఁ జూచి సమ్మద మొప్పఁ బలి :
ఏమిటఁ గొఱఁత మా? కెల్ల భోగములు
నీమన్ననయె చాలు సృపలోకచంద్ర,
ప్రియముఁ బెద్దఱికంబుఁ బేరుఁ గీర్తియును
జయమును నీతోడిసఖ్యంబె చాలు."
అనుటయు మఱియు నిట్లనియె భూవిభుడు
"విను కంకుభట్ట మీవిక్రమం బొప్పు!