పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-3

177


దాసియు వ్రేసియుఁ దాఁకఁగా మరలఁ
జేసియు నేసియుఁ జెలఁగి పోరాడి
ప్రథితసత్త్వమున నేర్పడ రెండువేల
రథముల వారిదర్పము భీముఁ డణఁచె,
వీరుఁ డై నకులుండు వెస నేడునూఱు
తేరుల ధరఁ గూల్చి తివుటమై నార్చె.
సన్నుతసత్త్వు డై సహ దేవుఁ డపుడు
మున్నూఱురథముల మొద లంట నఱకె.
పాయక యమసూతి బాహుదర్పమున
వేయి తేరులవారి విజయించి మించె.
అంతఁ బోవక త్రిగర్తాధీశుఁ దాఁకి
యంతకతనయుఁ డత్యంత వేగమున
ఘనదీప్తి నొప్పువ్రేకపువారసములఁ
జనుమఱ నాటింపఁ జాల మూర్ఛిల్లి
జవ మొప్పఁ దేఱి సుశర్మ ధర్మజుని
జవనాశ్వములమీఁద శరవృష్టిఁ గురిసె
ధీరుఁ డైయంతఁ గౌంతేయుఁ డావీరు
సారధిఁ జంపి యశ్వములఁ జెండాడె.

12