పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

ద్విపద భారతము.


సుశర్మచేఁగట్టువడిన విరటుని యుధిష్ట రాదులు
             విడిపించుట.
అది సందు గాఁగ మత్స్యాధీశుఁ డంత
గదఁ గొని వానివక్షము నొవ్వ నేసి
యతివృద్ధుఁ డయ్యుఁ బ్రాయమువానిపోలెఁ
గుతలంబునకు దాఁటి కుశలి యై పోయె.
కరువలిపట్టి త్రిగర్తనాయకుని
యరదంబునకు దాటి యతని బంధించి
పగతురగుండియల్ పగుల నార్చుటయు
మగఁటిమి దిగ నాడి మఱి వైరిసేన
భీతిల్లి వెస వికావీకలుగాఁ బాఱె.
ఆతతగతి భీముఁ డడ్డంబు వచ్చి
గొడుగులు వ్రేయించి కొమ రైనబిరుదు
పడగలు వ్రేయించి పసిఁ గ్రమ్మరించి
మఱియును రథవాజిమాతంగసమితి
నుఱక ధర్మజునకు నొప్పించె దెచ్చి. ·
చెలఁగి యీవిధమున సేనతోఁ గూడ
బలియుఁ ద్రిగర్తాధిపతిఁ బట్టి తెచ్చి
తమ్ములుఁ దానును ధర్మనందనుఁడు
సమదంబున మత్స్యజనపాలుఁ గనిన