పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

ద్విపద భారతము.


సాధనంలు మీకుఁ జాపబాణములు
సాధింపు వీరలు క్షణములో" ననిన
గురుకుంభయుగళ మంకుశము దాఁకుటయు
దరువు గూల్చక మానుదంతిచందమున
నన్న మాటకు భీముఁ డావృక్షచింత
క్రన్నన విడిచి సంగతి దోఁపఁ బలికె:
"అన్న మీ యానతియట్ల కావింతు,
సన్నుతగతిఁ బోయి జయముఁ గైకొందు.
మీరు రా వలవదు. మేము చాలుదుము.
గోరఁ బోవుపనికి గొడ్డ లేమిటకి "
అనవుడు సృపునితో నటమున్నె తాను
ఘనరణం బొనరింపఁ గలవాఁడ ననుచుఁ
బలికిన పలుకు లేర్చడఁ జెప్పి తనకుఁ
బలికి బొంకఁగ రానిభావంబుఁ జెప్పి
"వచ్చెదఁబద " మని వడి ధర్మరాజు
చెచ్చెరఁ జని వైరిసేనపైఁ గవిసె.
అనజుండుఁ దానును శస్త్రాస్త్రములను
మునుమిడి పుంఖానుపుంఖంబు లేయఁ
గర ముగ్రముగను ద్రిగర్త సైన్యములు
తిరిగి లోకములకు దిగులుగా నార్చి