పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-3

175


"అనిలజ మనకు సౌఖ్యంబుగా నితఁడు
ఒనరఁ గట్టడ చేసి యొక యేఁడు నిలిపె ;
నిలిపినవానికి నిక్కంబు గాఁగ
వెలయ నాపద యైన విడిపింప వలయు."
అనుటయు మే లెంచి యాభీమసేనుఁ
డని సేయఁ దివురుచు నన్న కిట్లనియె:
"అగు నట్ల కాక మహాప్రసాదంబు,
జగతీశ ననుఁ బంపు చాలు నీపనికి.
అల్లదె వృక్షంబు నవలీలఁ బెఱికి
త్రు ళ్లడంచియు దాయఁ దూలించి యేను
విరటుని విడిపించి వేవేగ వత్తు
వెరవుతో; నాశక్తి వీక్షింపు మిపుడు."
అనుటయు నగి పాండవాగ్రజుం డనియె:
"ఘనమహోత్సాహంబు గని మెచ్చి పొగడె
దింతసాహసి వౌట యెఱుగనే నేను?
అంతకార్యము వల దయ్య యీ వేళ.
లాలితగతులఁ గాలానకుఁ దగిన
కోలాహలము మేలు కొంతేసి మనకు.
కావునఁ జక్రరక్షకులుగా వీరిఁ
గావింపు మిదె నీకుఁ గవ లున్నవారు.