పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17 4

ద్విపద భారతము.


అప్పుడు వెలుఁ గైన నఖిల సైన్యములు
నెప్పటియట్ల పెల్లేచి పోరాడ
నాత్రిగ ర్తేశునియనుఁగుఁదమ్మునిని
విత్రాణుఁ డగుమత్స్యవిభుఁ డొప్పఁ దాఁ కె.
తాకినఁ గని త్రిగర్తలు నొక్క తెగువఁ
దాకి యవ్విభునిరధ్యములరూ పణఁచి
సారధిఁ దెగటార్చి చాపంబుఁ దునిమి
తేరును ధరణిపైఁ ద్రెళ్ల నేయుటయు
విరధుఁ డై ధరఁ గూలువిరటు పై కుఱికి
యురవడితో వాని నుక్కణంపకయ
కర మర్ధిఁ గాచి త్రిగర్తనాయకుడు
అరిమురిఁ దిగిచి బాహాపంజరమునఁ
దనతేరుమీఁద నాతని బట్టి కట్టి
ఘనయోధయూధంబు కడునార్చి యడర
జయజయధ్వనులతో జయ కాహళములు
జయదుందుభులు మ్రోయఁ జదలు గ్రక్కదలు
నంతటఁ దిరిగి సైన్యముల రాఁ బనిచి
సంతోషమునం గొంత సాగి పోవుటయు
విరటుని దెసఁ జూచి వెస ధర్మరాజు
అరు దైనకడఁక నిట్లనియె భీమునకు :