పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

ద్విపదభారతము.

అప్పుడు పాంచాలి యంతరంగమునఁ
దొప్పదోఁగినమోముతో నెలుఁ గెత్తి
యసురులచేఁ జిక్కి యమరేంద్రలక్ష్మి
మసలక వాపోవుమాడ్కి నిట్లనియె:
"కలితవిక్రములార, గంధర్వులార,
దళితశాత్రవులార, ధైర్యాత్ములార,
నిర్మలమతులార, నియతాత్ములార,
ధర్మసమ్మతులార, దయ సేయరయ్య.
చపలు రై తమయన్న శవముతోఁ గూడ
నుపకీచకులు నన్ను నుఱక బంధించి
కొనిపోవు చున్నారు కుటిలవర్తనులు.
ననుఁ గావరయ్య బన్నము లెల్ల మాన్చి
ఓ జయనిజనామ యోజయంతాఖ్య
ఓ జైత్రవిజయుండ యోజయ త్సేవ
ఓ జయద్బల నీకు నుచితమే యిట్లు
తేజంబు సూపక తెం పేదినట్లు
కాలయాపన సేయఁగా నౌనె యకట!,
ఏల యూరక యుండ నిట్టి కార్యమున ?"
ననుటయు నమ్మాట లాలించి పవన
తనయుండు మేల్కాంచి తలఁపులో నంత