పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము

139


"నరయంగ వెండియుఁ బ్రాణవల్లభకుఁ
బరులచే నీ పాట్లు పాటిల్లె" ననుచు
భయరక్షంణంబు గోప్యంబుగాఁ జేయ
రయమున నాప్రకారపుగోడ దాఁటి
పొలుపు మీఱినరుద్రభూమిలో నిలిచె
వెలసిన యొక మహావృక్షంబు బెఱికి
మనుజాశనుల నెల్ల మర్దించునపుడు
ఘన ద్వైత్యహరుఁ డుగ్రగతి నొప్పునట్లు
కుటిలకో పాటోపఘూర్ణి తాలోక
చటుల పాటనభుజాసంరంభుఁ డగుచు,

భీమసేనుఁ డుపకీచకులం జెండాడి ద్రౌపదిని విడిపించుట.'


అంతఁ గీచకవైరి నల్లంతఁ గాంచి
యంతయు భయముతో నెల్లకీచకులు
"అక్కటా గంధర్వు లదె వచ్చి రింక
నెక్కడఁ జొత్తు మిఁ కెట్లొకో? యనుచుఁ
గువలయనేత్రతోఁ గూడ గీచకుని
శవము ధారుణి వైచి చాల భీతిల్లి
పదపదుం డని పాఱి పాఱ లే కచట
నొదిఁగియు వృక్షంబు లొప్పఁ బ్రాఁకియును