పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

ద్విపద భారతము.

తనమాటలుగఁ గొన్ని ద్రౌపదీ దేవి
వినునట్లువానితోఁ వెర వొప్పఁ బలికె:
"అగుదు చక్క నివాఁడ వగునీకు నీవ
పొగడుకొంటివి నీకుఁ బొలుపారఁ దెలియు
నిన్నియు నన నేల యీరాత్రిలోన
నన్నుఁ బోలినయట్టినలినాక్షి గలదె ?
అడిగినఁ బ్రాణంబు లైన నీ వలదె
యెడపక నాకు నీ వివి దెచ్చు టెంత ?
ధీయుక్తి నన్నుఁ బొందియు నీవు మరలి
పోయి వే ఱొక నాతిఁ బొందఁ గల్గుదువె ?
పొందిన నేను నేర్పున మేను గన్న
చంద మేటికి ? " నని సన్నద్ధుఁ డగుచు
ఖండిత వైరివిక్రముఁ డైనవాని
దండింప నొడిసి ముందలఁ బట్టి యీడ్చె.

కీచకుఁడును భీమసేనుఁడు నొండొరులతోడం బెనఁగుట.



కడఁకతో వాఁడును గర్వాంధుఁ డగుచు
విడిపించికొని లేచి వేగంబ కదిసి
సవరించి రెండుహస్తములు రాఁ దిగిచి
పవనజు నవనిపైఁ బడ వైచి పట్టి