పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-2

125

"దాయ కిం కెక్కడఁ దప్పి పో వచ్చు ?
చేయ నిచ్చెదఁ గొన్ని చేష్ట లిచ్చోట"
నని యూరకున్నచో నాసింహబలుఁడు
తన కేలు వాయునందనుమీఁదఁ జాఁచి
గారవించుచు మేను గరుపాఱు చుండ
భూరివిభ్రమలీల బుద్ధి చలింప
మదనభూతము సోఁకి మర్మంబు వదలి
కదియ వచ్చుచు మోహకలితుఁ డై పలికె:
"లీలతో నబల మేలిమివస్తువులను
వాలాయమున నీకు వలచి తెచ్చితిని.
తనరారువేడ్క ను దవిలి యంగనలు
చనవున నాకు లంచములు పెట్టుదురు,
నీ వొక తెవు నన్ను నిజముగా నేఁడు
ఈవిధంబున మించి యేలఁ జాలితివి!
నన్నుఁ జూచినయట్టినలినాయతాక్షి
యెన్నఁడు నొరుఁ జూడ నెంచదు మదిని,
పురుషులలో నేను పురుషరత్నమను
తరుణులలో నీవు తగినరత్నమపు. "
అని యిట్లు పలికెడుననదమాటలకు
ననిలసూనుఁడు వాని నధముగా నెన్ని