పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-2

127

కడుపును దొడలు మోఁకాళ్లుఁ బొడువ
వడి లేచి కోపించి వాయునందనుఁడు
గుదిగొనఁ బట్టి గ్రక్కున వానిఁ దివియ
నదయుఁ డై వాఁడు నయ్యనిలజుఁ బట్టె.
ఒండొరు లీరీతి నుగ్రు లై కణఁగి
దండిమైఁ దిగిచి యుద్ధంబు సేయుచును
దొండంబు లొండొంటితో రాయు చుండు
శుండాలములరీతి స్రుక్కక కినిసి
యొరులు త మ్మెఱిఁగిన నొచ్చంబు గాన
నిరువురు నేకాంత మిట్లు వాటించి
పద రెడిగుండియల్ పగులఁ బొడుచుచుఁ
జదియ వీపులు ముష్టిఁ జావ వ్రేయుచును
సజ్జపై మోఁదియు సర్వాంగములును
నజ్జగాఁ బొడిచియు నలి రేగి యపుడు
కరములు శిరములు గళము లాయములు
నురము బిరముల నొండొంటి నొప్పింప,
పదఘట్టనలను భూభాగంబు పగుల
నదలుపు పెట్టిన నాకాశ మగల
నున్న చో బకవైరి యుగ్రుఁ డై యిట్లు
తిన్న నియెలుఁగుతోఁ దెఱఁ గొప్పఁ బలికె: