పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

91


బడఁతుక పెనఁగి యప్పాపాత్ము చేయి
విడిపించికొని పాఱి వెడలె నాయిల్లు.
అట్టిద కాదె, యన్యాయవర్తులకు
బట్టినపని కామ బల మెంత యున్న.

తసపట్టు వదలించుకొని పాఱు ద్రౌపదిం గీచకుఁడు వెన్నాడుట

కోమలి తప్పించికొని పోవఁ బోవఁ
దామసుఁడై వెంటఁ దగిలి కీచకుఁడు
నమిలి దఱుము బాలనాగంబులీలు
విమతుఁ డై యేతేర వెలది వీక్షించి
"ఎక్కడ జొత్తు నాకెటు పోవ" ననుచు
దిక్కులు చూచుచుఁ దెగి పాఱు చుండఁ
దనభాగ్యమునఁ జేసి ధరణీశుఁ డపుడు
ఘసలీలఁ గొలు వున్నఁ గదిసె నచ్చటికి .
ఖలుఁడు కీచకుఁ డంతఁ గామాతురుండు
సలఘుసత్వుండు గర్వాంధుండు గానఁ
బ్రజ చూడఁ బరకాంతఁ బట్టఁ బోరామి
నిజముగా నెఱిఁగియ: నీతిఁ బో విడిచి
జలజాక్షిఁ గదీసి యచ్చటివారు చూడ
తలఁ బట్టి తిగిచి యుద్ధతి నేలఁ ద్రోచె.