పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

ద్విపద భారతము


"ఏల మద్యము పోయ వెంతసే పున్న
ఆలస్యమున కింతి కాగ్రహం బడరు.
కలదు లేదని చెప్పి కడువేగఁ బనుపు ;
పలుకు లేటికి నాకుఁ బని చాలఁ గలదు."
అనవుడు నాతికి ట్లనియెఁ గీచకుఁడు :
"పను లెల్ల నను నేలుపనిఁ బోల దబల,
సౌరాజ్యలక్ష్మికి, నాధనంబునకు,
నారత్న రాశికి, నాసర్వమునకు
నలినాక్షి రాణి వై నాకులస్త్రీల
బలుమాఱు నేలుచుఁ బనిగొందు కాక,
మగలు హీనులు గాన మగువ నీకిట్లు
మొగి నితరుల కార్యములు: సేయ వలసె.
తరుణి నా యెడ నీవు డయ సూపుదేని
నిరతంబు నినుఁ గొల్చి నే నుండువాఁడ.
విసివెదు నామాట విన నేర" వనుచు
ననమసాయకుగాసి నలసి కీచఁకుడు
నయము చాలక మున్ను నవసుధాధాము
రయమునఁ బట్టిన రాహుచందమున
నింతిఁ బట్టినఁ గావ నేతెంచు దైత్యుఁ
డెంతయుఁ దనసత్వ మెల్ల నిచ్చుటయుఁ