పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

ద్విపద భారతము


అంత సూర్యునియాజ్ఞ నరుదెంచుదూత
వింతయౌ బలిమిని వ్రేసెఁ గీచకుని.
వేసినఁ బులి కోల వేసిన ట్లులికి
యాసరోజాక్షిని నటు దోరగించి
యొడుపు దప్పినయట్టియురగంబు పోలె
నుడుకుచు నుండె నిట్టూర్పులు నిగుడ.

ద్రౌపదిపాటుఁ గని భీముఁడు రేఁగుట.

అప్పు డగ్రజునితో నాస్థానసీమ
నొప్పువాయుజుఁ డట్టు లు న్మదలీల
ద్రౌపది సభలోనఁ దల బట్టి యీడ్చు
పాపాత్ము జూచి కోపము సైఁప లేక
"దుశ్శాసనుఁడు సేయుదుండగం బిపుడు
నిశ్శంకఁ జేసె నిన్నియునేల " యనుచు
సర పైనకనుదోయి నిప్పులు రాలు
గరుపాఱి చెమట నంగము దొప్పదోఁగ
సమదకీలాభీలచటులోగ్రదృష్టి
రమణతోఁ గాలభైరవమూర్తి దెగడి
తలఁచె నప్పుడు భూమితలము నాకసము
వెలయుతాళములుగా వ్రేసి యాడంగ