పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

89


వేఁడినిట్టూర్పులు విరహ తాపంబు
పోడిగా బాధింపఁ బూఁబోణిఁ జూచి
యిందు ర మ్మనఁ జూచు నేదు రేగఁ జూచు
సం దంద దుష్టేచ్ఛ లడఁగింప లేక .
సతి యంత నిల్చి కాంచన పాత్రఁ జూపి
యతనికీ మొగ మీక యపు డిట్లు లనియె:
"ఘన మైనదప్పిఁ గేకయరాజపుత్రి
యనిచె న న్ని చటిమద్యంబుఁ దెమ్మనుచు.
పోయింపు మిదె వేగఁ బోనంగ వలయు ;
ఆయింతి కోపించు నాలస్య మైన."
అనవుడుఁ గీచకుం డాముగ్ధ జూచి
"వనిత నీ వేటికి వచ్చి తీపనికి?
మెచ్చులమద్యంబు మెలఁత కీక్షణమె
పుచ్చెద నీ వందుఁ బోవంగ వలచు.
మన సార మాన్చెద మాయంపుదప్పి  ;
వనిత నాదప్పియు వలదె మాన్సంగ ? "
అని యంత నిలునక యతినీచుఁ డగుచు
ననయభాషల నాడ నరవింద నేత్ర
తనికినచింతచేఁ దల్లడిల్లుచును
విననట్లు చూపట్టి వెస నిట్టు లనియె: