పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


అని ప్రార్థనము చేయ నాసూర్యుఁ డొక్క
దనుజునిఁ బుత్తెంచెఁ దరుణి రక్షింప.

ద్రౌపది కల్లు దేరం గీచకునింటికిఁ బోవుట

వాఁడు నదృశ్యుఁ డె వనిత వెన్నంటి
పోఁడిగా వినువీధి బొంచి యుండఁగను
దూలుచు సోలుచు దుఃఖభారమున
వ్రాలుచుఁ దాను వారణయాన గాన
భయముతో నలసింహబలునిల్లు దఱిసి
నియతి దప్పమిచేసి నెగు లొంది కుంది
ముద మేది రాహుప్తుముఖగహ్వరంబుఁ
గదిసిన శీతాంశుకళఁ బోలెఁ జూడఁ
గుటిలకుంతల వానికొలువుకూటంబుఁ
దటుకునఁ జొచ్చియాతలికక్ష్యఁ గడచి
ఓలి బండరువులు నుగ్రాయుధముల
శాలలు గజవాజిశాలలు గడచి
మెఱసి మేఘముఁ జొచ్చు మెఱుఁగుచందమునఁ
బఱచి కీచకుఁ డున్న భవనంబుఁ జొచ్చె.
అప్పుడు సంతోష మాననాబ్జమున
ముప్పిరి గొను చుండ మోహించి వాఁడు