పుట:దేశభాషలలో శాస్త్రపఠనము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశేషంబులు తగ్గును అందుచే నింగ్లీషుభాషాధ్యయనమువలన మనకు నిప్పడు గలుగుచున్న యద్భుతమైన మానసోన్నతియు నాదరోృదయ ములును దొలఁగి మనకు మిక్కిలిహాని సంభవించునని కొందఱనవచ్చును ఇంగ్లీషు విద్యార్ధు లింగ్లీషు వాజ్మయంబు నధికముగా నభ్యసింపవలయు నన్నమాట నాకును సమ్మతమే ఆ యద్వితీయ వాజ్మయ ప్రభావమును నేనెఱుంగుదును దాని నభ్యసించి మనభాష నంతస్థితికిఁ దెచ్చుటయే విద్యా ధికుల యర్ఘకృత్యమిని నా తాత్పర్యము కాని యాభాషయందు గణితమును, బీజగణితమును, గమ్మరమును, గుమ్మరమును నేర్చినఁగాని యాభాష చక్కగా రాకపోవునని నేను దలపను కావ్యములను, వ్యాసములను, జర్చలను, జరిత్రలను, రాజకీయోపన్యాసములను, నుద్దంథములను, దత్వగ్రంథములను చదివిన బాషాప్రావీణ్య మలవడు నేగాని గణితాదికములు చదివినందునఁగాదు. కావుననింగ్లీషు చక్కగ రావలయునన్న నిప్పడింగ్లీసు వాజ్మయము దినమునకు నొక్క గంట చెప్పచున్న యెడల నిఁక ముందు రెండుగంటలు చెప్పవచ్చును శాస్త్రములు తెలుఁగు లోఁ జెప్పవచ్చును ఇ టైంగ్లీషువాజ్మయమును జక్కఁగఁ బూర్తిగ నేర్చుకొనవచ్చును శాస్త్రములను సాధింపవచ్చును ఇప్ప, ‘ డితో భ్రష్ట _తతో భ్రష్ట" అన్నట్టు మన బాలకులకు నింగ్లీషు బాగుగ వచ్చుట లేదు, శాస్త్రములు చక్కఁగఁ దెలియుట లేదు. ఇకముందు నేను జెప్పిన ఏర్పాటు చేసినయెడల విద్యార్ధు లన్ని విషయములందును బాండితి కలవారగుదురు. ఇప్పడు పరభాష లో శాస్త్రముల నేర్చుకొనుటకుఁ బట్టుచున్న పరిశ్రమ నే, యింగ్లీషు వాజ్మయమును వశపఱచు కొనుటకు నుపయోగించితి మేని యింగ్లీషు గ్రంథకారులతో దులతూగునట్టి యాంగ్ల సాహితి మనకుఁ దప్పక యలవడఁగలదు.

ఇంగ్లీషువిద్యను గఱపు బడులలోనే శాస్త్రములను దెలుఁగునందుఁ జెప్పమన్నపుడు ప్రాధమిక పారశాలల నన్ని విషయములను దెలుఁగునందే నేర్పవలెనని వేఱుఁగఁ జెప్పవలెనా ? ఇంగ్లీషు రాక యే మనవారు బీజగణిత మందలి వర్గ సమీకరణము (Quadratic Equation) అనేక వర్ణసమీకరణము (Simultaneous Equations), రేఖాగణితమందలి వృత్త (Circle) దీర్ఘ వృత్త (Ellipse) సంబంధమైన సిద్ధాంతములును, భౌతికశాస్త్రమందలి విద్యుత్ర్ప వాహకములను గుఱించిన సిద్ధాంతములును దేట తెలుగున నొకరితో నొకరు సంభాషించుసమయము తెనుఁగు దేశమున కబ్బెనేని యది మనదేశాభ్యు దయమునకు నిశ్చయమైన చిహ్నమని చెప్పవచ్చును ఇది మనలోఁగొంద ఱకు విశేషముగా నింగ్లీషుభాష తప్ప జ్ఞానార్టనమునకు వేఱుసాధనముండునా