పుట:దేశభాషలలో శాస్త్రపఠనము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యని తలంచువారికి నేనుగోరిన కోర్కె గొంతమ్మకోర్కెవలె దోచిన దోఁపవచ్చును కాని మహారాష్ట్ర దేశమునకు వెళ్లి చూచిన యెడల నిందేమియు వింతలేనట్టు స్పష్టపడ గలదు. నేను పదార్ధవిజ్ఞానశాస్త్రమును మొదట మహారాష్ట్రమునందె చదివితిని. ఎఫ్ ఎ పరీక్షకుఁ జదువు విద్యార్ధులకు బీజగణితమందలి కొన్ని లెక్కలను మరాటీలో బోధ చేయునట్టి యింగ్లీషు రానట్టి నార్మల్ స్కూల్ మరాటీవిద్యార్ధుల నేనెఱుఁగుదును కొన్ని దినముల క్రిందట విజ్ఞానసర్వస్వము నిమిత్తమై యార్యగణితమును గుఱించి కొన్ని సంగతులు తెలిసికొనుటకుఁ జెన్న పట్టణమందలి ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారమునకుఁ బోవుట తటస్థించెను అప్పడు నేనచ్చట బీజగణితములోని అను సూత్రములను గాగితముమీద వ్రాసికొని లెక్కలు వేసికొనుచుండగా నొకవైష్ణవుఁడువచ్చి యదియేమని నన్నడిగి విషయము కొంచెము తెలిసికొని వెంటనే వానితో సమానములైన సూత్రములను సంస్కృతములోఁజదివి నాకెంతయు విస్మయమును గలుగఁ జేసెను' ఈ వైష్ణవున కింగ్లీషు రాదు-సంస్కృతము, అరవము, కొంచెము తెలుఁగు మాత్రము వచ్చును ఈ బీజగణితసూత్రము లాతఁడు వీధిబడిలో నేర్చుకొనెనఁట కావున నెట్టి ఘనమైన శాస్త్రములైన నాంధ్రమున బోధచేయ వచ్చును ఆంధ్రమున వ్రాయవచ్చును

గ్రంథనిర్మాణము

కావున మనము మొట్టమొదట చేయవలసినపని శాస్త్రీయ గ్రంథముల నిర్మించుట శ్రమపడి యిట్టి గ్రంథములను వ్రాసిన నేమి ప్రయోజ నము ? ఎవరు చదివెదరు ? గ్రంథకర్త కేమి లాభము ? అని కొందఱడుగ వచ్చును కాని మనమిట్లు నష్టజా తకముల గుణించుచు నెన్ని దినము లుండ వలెను ? ఇట్లు నష్టజాతకము గుణించువా రెవరేమి యన్నను దానిని ఖండిం చుటకు సిద్ధముగానుందురు. పారశాలలలోఁ దెలుఁగున శాస్త్రములు చెప్పఁడనినపుడు మీకుఁ దెలుఁగులో శాస్త్రగ్రంథము లేవియని యడ్డము చెప్పదురు. శాస్రగ్రంథములు వ్రాయుఁ డన గానె "ఆ గ్రంథముల నుప యోగించు బళ్లేవోయి' యని వీరె మరల నడ్డమువచ్చెదరు. వీరి సిద్ధాంత మనుసరించినఁ బిచ్చికుదిరినఁగాని పెండ్లికాదు, పెండ్లియైనఁగాని పిచ్చి కుదురదు వీరివాదము వినుచుండినఁ బిచ్చియుఁ గుదురదు, పెండ్లియు గాదు కావునఁ బరస్పరాశ్రయదోష భూయిష్టమైన వీరివాదమును చూచి మనము భయపడవలదు