పుట:దేశభాషలలో శాస్త్రపఠనము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చక్కఁగఁ జేసికొనలేనివానికి 'యూక్లీడు' భూమితి యింగ్లీషులోఁ జెప్పి "గందునఁ బ్రయోజనమేమి? భట్టీ పెట్టుట, యనఁగా నర్ధము తెలిసినను, డెలియక పోయినను వల్లించి తూచా తప్పకుండ నొప్పగించి పరీక్షలలోఁ గృతార్ధులగుట, యిందువలన సిద్ధించుచున్నది చెప్పినదానికి నర్ధముచేసి గాని కొనుట గానీ, మనస్సునందలి యూహల జెప్పటకుఁ గాని తగినంత భాషా జ్ఞానము లేనివారు గ్రుడ్డిపారములు చేయక పరీక్షలోఁ గృతార్ధులగుటకు వీలున్నదా ? లేదు కావున నింగ్లీషులో నీ విషయమును నేర్పి మనము మన విద్యార్ధుల యొక్క బుద్ధి వైభవమును దగ్గించు చున్నామని నా యొక్క దృఢనిశ్చయము ఇప్పడు ప్రవేశ పరీకవఱకుఁ జదువుచున్న విద్యార్ధుల ధారణాశక్తియంతయు, నింగ్లీషునందు భిన్న విషయముల నింగ్లీషుభాషలో వల్లించుటయందే వ్యయమగుచున్నది స్వభాషయందు వారికీవిషయముల నేర్పిన నింతపరిశ్రమ యుండడుగదా? వారికి విషయము బహుసులభముగా బోధపడును ఒక్కసారి బోధపడిన తరువాత విద్యార్థి గ్రంధమునంతయు వల్లింపఁబనిలేదు ప్రశ్నలకు విద్యార్థి ప్రత్యుత్తరము చెప్పనపుడు తన మూటలలోనే చెప్పఁగలఁడు తనవూటలలోనే వ్రాయఁగలఁడు అందుకై వేఱుపరిశ్రమగాని ప్రయత్నముగాని యక్కఱలేదు వచ్చిరాని ఇంగ్లీషులో నేర్చుకొనుటకంటెను, బదులు చెప్పటకంటెను, స్వమాతృభాషలో నేర్చు కొనుటయు బదులు చెప్పటయు నూఱు రెట్టు సులభతరము ప్రతిపారశాల లోను బ్రవేశపగీకవఱకును බීෆ గ్లీషు, సంస్కృతము మొదలగు వాజ్మయ నిషయములు తప్ప మిగిలిన విషయములన్నియు, అంకగణితము, బీజగణితము, రేఖా గణితము, క్షేత్రగణితయి, పదార్ధవిజ్ఞానశాస్త్రము, రసాయన శాస్త్రము మొదలయినవన్నియు, బాలకుల మాతృభాషలయందు నేర్పిన యెడల నిప్పడు బి ఏ వారి కీవిషయములందు నెంత ప్రవేశముకలదో యంత ప్రవేశము ప్రవేశపరీక్షలోని విద్యార్ధులకుఁ గలుగుననియు గనీసము మూఁడు సంవత్సరముల కాలము కలిసివచ్చు ననియు, నందుకయ్యెడు వ్యయ ప్రయాసలు తప్పననియు నాయొక్క దృఢమైన యభి ప్రాయము బడిజీతములు భరించుటకు వీలులేకుండఁ బెరిగిన యీ కాలమున నొక్కొక విద్యార్థికి మూఁడు సంవత్సరము లనఁగా వేయి రూపాయలని వేఱుగఁ జెప్ప నక్కఱలేదు నలుగురు పిల్లలు గలవారికి నాలుగు వే లా దాయముగదా !

ఒక యాక్షేపము

కాని యిట్లు చేసిన యెడల నింగ్లీషుభాష మనవారికిఁ జక్కఁగ నల వాటు కాదు దానియందు మనవిద్యార్ధులకుఁ గలుగుచున్న ప్రజ్ఞా