పుట:దేశభాషలలో శాస్త్రపఠనము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

will be others who will find similar fault with his own creation ... what happens at present is that every new writer arbitrarily mints his own technical terms not taking pains to see what his predecessors in the same department, have done. It is easy to say for one that a certain word is not an accurate rendering of its corresponding English word but if this very objector is requested to make his own suggestion and from every point of view a faultless one, he often finds himself unable to do it and then atonce gives in his adhesion to the old proposal.” ఇట్లు వీరి పదములు వారికిఁ బనికి రావు: వారిపదములు వీరికిఁ బనికి రావు. వీరికందఱకుఁ బనికివచ్చుపదము లేర్పడువఱకు గ్రంథములు వ్రాయకుండఁ గూర్చుండిన యెడలఁ గాలాంతమువఱకు నిట్లే యుండవలెను ! కావున బుద్ధిమంతులు చేయవలసినపని యేమనఁగా నిట్టి గ్రంథములు వ్రాయునపు డదివఱకు గంథములు వ్రాసినవారిచే నుపయోగింపఁబడిన పదములనే వీలయినంత వఱకు వాడవలెను. అట్టి పూర్వగ్రంథములు లేకపోయినపుడును, నితరుల పదముల నుపయోగించుటకు నిష్టము లేనప్పడును స్వయముగాఁ బదముల నిర్మింపవచ్చును. అదియు నిదియుఁ జేతకానప్ప డింగ్లీషు పారిభాషిక పద ములనే తీసికొవి గ్రంథము వ్రాయవచ్చును. కాని పదములు లేవని, எஞ் గ్రంథములు నిర్మించుట మూనవలదు. శాస్త్రములు మెుదటఁ బుట్టును. పారిభాషికపదములు పిదప స్థిరపడును. ఇది యే యితర దేశమందలి శాస్ర వాజ్మయాభివృద్ధి యొక్క మర్యాద. పాశ్చాత్యదేశమందు జంతుశాస్త్రము మిక్కిలి యభివృద్ధి నొంది, యందలి పారిభాషికపదములు పండితపరిషత్తు లచే నిర్ణయింపఁబడుచున్నవని మీరందఱు నెఱింగిన విషయమే. అట్టి శాస్త్రము యొక్క పారిభాషిక పదములు నప్పడప్పడు మాఱుచునే యున్నవి. ౧౭౬౬ లినాయిస్ అను శాస్త్రజ్ఞుఁడు జంతువుల వర్గీకరణ మేర్పఱచి యొక పరిభాష యేర్పరిచెను. 1829 లో క్యువియర్ అను వాఁడు దానిని గొంతవఱకు మార్చి క్రొత్తపరిభాష నిర్మించెను. 1835 లో జీవన్ అను శాస్త్రజ్ఞుఁడు మరల నీవర్గీకరణమును దిద్దెను. ౧౮౪౮ లో ఆర్. ల్యూకార్డు అనువాఁడును, ౧౮౫౫ లో హెన్‍రి ఎడ్వర్డ్స్ అను వాఁడును, ౧౮౫౯ లో అగాజిన్ అనువాఁడును, ౧౮౬౬ లో హెకల్ అను శాస్త్రజ్ఞుఁడును, 1910 లో ల్యాంకిష్టరు అనువాఁడును మఱికొందఱును జంతుశాస్త్రములందలి వర్గీకరణ పరిభాష నిష్టము వచ్చినట్లు మార్చిరి. తుదకు ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా యొక్క 11 వ కూర్పునందు జంతు శాస్త్రమను ముఖ్యవ్యాసము వ్రాసిన లేఖకునకు నాశాస్త్ర సంబంధమైన యితర వ్యాసములు వ్రాసిన లేఖకులకును వర్గీకరణమును గుఱించియుఁ, పారిభాషికపదములను గుఱించియుఁ బెక్కభిప్రాయ భేదములు కలవు !