పుట:దేశభాషలలో శాస్త్రపఠనము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇప్పడు మన దేశమునందు దేశ భాషాభివృద్ధికిఁ గొంతప్రయత్నము జరుగుచున్నను, లలితవాజ్మయాభివృద్ధియందే యొక్కుడు శ్రద్ధ కానవచ్చు చున్నది. ప్రకృతిశాస్త్రనిర్మాణమునకు నొకటి రెండు సంఘములు తప్ప నితరములు ప్రయత్నించుట లేదు. ఇది యెంతయు శోచనీయము భాషాభి వృద్ధికై మనవారు చేయు ప్రయత్నములలో సగము ప్రయత్నము శాస్త్ర జ్ఞానాభివృద్ధికిని, సగము ప్రయత్న మితర లలితగ్రంథాభివృద్ధికిని వ్యయ పడునట్లు చూచుచుండవలెను. ఒకానొక సంఘము పది గ్రంథములను బ్రక టింపఁదలఁచెనేని వానిలోనైదు భౌతికాదిశాస్త్ర ప్రవర్తకములుగను, మిగి లిన యయిదు వేఱువిషయములను బ్రతిపాదించునవిగను నుండునట్లు చూడవలయును ఒకానొక జమీందారుగారు గ్రంథకర్తలకు బహుమతు లీయఁదలఁచిన నందు సగముధనము శాస్త్రములకును, సగముధన మితర విషయములకును బంచింుూవలయును. శాస్త్రగ్రంథములు వందలకొలఁది వెలువడినతరువాత నీ నియమమును బాటించినను బాటింపవచ్చును కాని యంతవఱకు నీ నియమమును మన వారు శ్రద్ధతో బాట్రించినఁగాని యు.ూ" దేశము యొక్క యార్ధికావస్థ యభివృద్ధిఁ జెందనేరదు ఇప్పడిప్పడు కొన్ని ప్రకృతిశాస్త్ర గ్రంథములు వెలువడినవీ కాని వెలువడినవి స్వల్పము వెలువడవలసినవి. యసంఖ్యములు వేలకొలఁది గ్రంథములు పుట్టవలసినచోటఁ బది యిరువది పుట్టిన నేమూలకువచ్చును ? బంగాళీభాషయందును, మరాటీ భాష యందును వ్రాయబడిన భౌతికశాస్త్రగ్రంథములను జూచిన నెట్టి వానికైనను విభ్రమము కలుగక మానదు

పారిభాషికపదములు

దేశభాషలలో శాస్త్రీయగ్రంథములు వ్రాయుటకు శాస్త్రీయపద ముల యభావ మొుక ప్రబలకారణమని కొందఱు చెప్పచున్నాగు కాని శాస్త్రీయపదములకై యెవ్వరు నాగనక్కఱలేదు ఇదివఱకుఁ గొందఱచే నేర్పాటు చేయబడిన పదము లుండెనేని వానినే స్వీకరించి గ్రంథము వ్రాయవచ్చును "ఇదివఱకున్న పదములు బాగుగ లేవు' అని మూతివిరుచు వారు పెక్కురు గలరు అట్టివారి కీక్రిందివిధమున "The Twentieth century English Maratta Dictionary (Literary, Scientific and Technical)”eo మహాకోశము యొక్క కర్త యిట్టు ప్రత్యుత్తర మిచ్చియున్నాఁడు. * It may be that a word newly coined by two or three experts may be found fault with as inaccurate by a fourth one This fourth expert will offer his own coinage as an improvement forgetting all along that there