పుట:ది కేటల్ ట్రెస్‌పాస్ యాక్టు, 1871.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నష్టపరిహారమును వసూలుచేయుట,

23. 22 వ పరిచ్చేదములో పేర్కొనబడిన నష్టపరిహారము, జుర్మానాలు మరియు న్యయములు అవి మేజిస్ట్రేటుచే విధింపబడిన జుర్మానాలు అయియుండిన యెట్లో అట్లే వసూలు చేయబడవచ్చును.

అధ్యాయము-6

శా స్తు లు

పశువుల అభిగ్రహణమును బల ప్రయోగముతో ఎదిరించినందుకు లేక వాటీని తప్పించినందుకు శాస్తి,

24. ఈ చట్టము క్రింద అభిగ్రవాణము చేయదగు పశువుల అభిగ్రహణమును బలప్రయోగముతో ఎదిరిచువారెవరైన;

మరియు అభిగ్రహణము చేసిన తరువాత ఆ పశువులను బం దెల దొడ్డి నుండి గాని ఈ చట్టము ద్వారా ప్రదత్తము చేయబడిన అధికారముల క్రింద. వ్యవహరించుచు ఆ పశువుల దగ్గరనే వుండి వాటిని బందెల దొడ్డికి తోలుకొనిపోవుచున్న లేక పొబోవుచున్న ఎవరేని వ్యక్తి నుండి గాని, తప్పించువారెవరైనను,

మేజిస్ట్రేటు సమక్షమున దోషిగా నేర నిర్ణీతుడయిన మీదట. ఆరు మాసములకు మించని కాలావధివరకు కారావాసముతో గాని అయిదు వందల రూపొయలకు మించని జుర్యానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడవలెను,

పశువులను అక్రమ ప్రవేశము చేయ నిచ్చుట ద్వారా చేసిన దుశ్చేష్టకై శాస్తి వసూలు.

25. 3[దీని తరువాతి పరిచ్చేదము క్రిందగాని] ఏదేని భూమిపై పశువులను అక్రమ ప్రవేశము చేయనిచ్చుట చ్వారా చేసన దుశ్చేష్టాపరాధమునకుగాని విధింపబడిన ఏదేని జుర్మానాను అక్రమప్రవేశము చేయుచున్నప్పుడే పశువులు అభిగ్రహణము చేయబడిన వనను కాకున్నను, మరియు అవి ఆ అపరాథమునశై దోషిగా. నేర నిర్ణీతుడయిన వ్యక్తి యొక్క అస్తియైయున్న వైనను, లేక. అక్రమప్రవేశము జరిగినపుడు అతని వశమునందు మాత్రమే యున్నవై నను, అక్రమ ప్రవేశము. చేసిన పశువులన్నింటిని గాని వాటిలో దేనినై ననుగాని విక్రయించి వసూలు చేయవచ్చును.

భూమిని లేక పైరులను లేక పబ్లిక్ రొడ్లను పందులు పాడు చేసినందుకు శాస్తి.

26. ఎవరేని పందుల సొంతదారు లేక కాపరి, నిర్లక్ష్యము వల్ల గాని అన్యథా గాని ఏదేని భూమినిగాని భూమిపై గల పైరులేక పంటనుగాని ఏదేని పబ్లికు రోడ్డును గాని దానిపై అట్టి పందులను అక్రమ ప్రవేశము చేయనిచ్చుట ద్వారా పాడు చేసినచో లేక పాడు అగునట్లు చేయించినచో లేక పొడుచేయని చ్చినచో అతడు మేజి స్ట్రేటు సమక్షమున దోషిగా నేరనిర్ణీతుడై న మీదట పది రూపాయలకు మించని జుర్మానాతో శిక్షింపబడవలెను,

4[రాజ్య ప్రభుత్వము ఆయా సమయములందు అధికారిక రాజపత్రములో అధిసూచన ద్వారా, ఆ అధిసూచనలొ నిర్దిష్ట పరచబడు ఏదేని స్థానిక ప్రాంతము విషయమున ఈ పరిచ్చేదమునందు పైన చెప్పబడిన భాగము, అది పందులకు మాత్రమే వర్తించు నిర్దేశమునకు బదులు సాధారణముగా పశువులకన్నింటికి నిగాని ఆ అధిసూచనలో పేర్కొనబడు ఏదేని ఒకరకపు పశువుల కన్నింటికిగాని, వర్తించు నిర్దేశమును కలిగియున్నట్లుగను లేక “పది రూపాయలు” అను పదములకు. బదులు “ఏబది రూపాయలు " అను పదములు ఉంచబడినట్లుగను, లేక అందు అట్టి నిర్దేశము, అట్టి బదలాయింపు రెండును ఉన్నట్లుగను, చదువుకొనబడవలెనని ఆదేశించ వచ్చును.]



1 భారత శిక్షాస్మృతి, 1860 ( 1860 లోని 45) యొక్క పరిచ్చేదములు 63 నుంచి 70 క్రిమినల్‌ ప్రక్రియా స్మృతి, 1898 ( 1898 లొని 5) యొక్క పరిచ్చేదము 386. సాధారణ ఖండముల చట్టము, 1897 ( 1897లోని 10) యొక్క పరిచ్చేదము 25 చూడుము.

2. రైలు మార్షములపై పశువులు అక్రమముగా ప్రవేశించు విషయములో పరిచ్చేదము 25 యొక్క వర్తింపునకై, భారతీయ రైలు మార్గముల చట్టము, 1890 (1890లోని 9), పరిచ్చేదము 125 (3) చూడుము.

3. 1891లొని 1వ చట్టము, పరిచ్చేదము 7 ద్వారా చొప్పించబడినది.

4. 1891లొని 1వ చట్టము, పరిచ్చేదము 8 ద్వారా చొప్పించబడీనది.