పుట:ది కేటల్ ట్రెస్‌పాస్ యాక్టు, 1871.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జుర్మానాల, వ్యయముల మరియు విక్రయపు రాబడిలోని మిగుళ్ళ వ్యయనము,

17. విక్రయము చేసిన అధికారి అట్లు మినవోయింపబడిన జుర్మా నాలను జిల్లా మేజిస్టేటుకు పంపవ లెను.

16వ వరిచ్చేదము క్రింద మినహయింపబడి, మేత పెట్టుటకు మరియు నీరు పెట్టుటకు అయిన ఖర్చులు, బం దెలదొడ్డి రక్షకునికి చెల్లింపబడవ లెను. ఆ బం దెలదొడ్డి రక్షకుడు 13వ పరిచ్చేదము క్రింద అట్టి ఖర్చులకుగాను తనకు ముట్టిన సొమ్మునంతను కూడ ఉంచుకొని వినియోగించవలెను.

పశువుల విక్రయపు రాబడిలోని మిగులులో 'క్లెయిము చేయబడని దానిని, జిల్లా మేజిస్టేటుకు పంపవలెను. ఆయన దానిని మూడు మానములవరకు డిపాజిటుగా ఉంచుకొని, ఆ కాలావధి లోపల దానికై ఎట్టి క్లెయిము చేయబడక పోయినచో, మరియు నిరూపింప బడకపోయినచో, ఆ కాలావధి ముగినన మీదట, ఆయన 1[దానిని ఆ రాజ్యపు రెవెన్యూల రూపమున ఉంచుకోనినట్లు భావింపబడవలెను. ]

18. [జుర్మానాల వినియోగము మరియు క్లెయిము చేయబడని విక్రయపు రాబడులు] ఏ, ఓ 1937 చ్వారా రద్దు చేయబడినది.

ఈ చట్టము క్రింది విక్రయములలో అధికారులు మరియు బందెలదొడ్డి రక్షకులు పశువులను కొనరాదు.

19, ఏ పోలీసు అధికారిగాని, బందెలదొడ్డి రక్షకుడుగాని ఈ చట్టములోని నిబంధనల క్రింద నియిమింపబడిన ఇతర అధికారిగాని ఈ చట్టము క్రింది ఏదేనీ విక్రయములో ప్రత్యక్షముగ నైనను పరొక్షముగనై నను ఏ పశువును కొనరాదు.

బందెలదొడ్డి రక్షకులు బందెలో పెట్టబడిన పశువులను ఎప్పుడు విడుదల చేయరాదు,

బందెలదొడ్డి రక్షకుడు ఎవరై నను, బందెలో పెట్టబడిన పశువును దేనినైనను, మేజిస్ట్రేటుచే, లేక సివిలు న్యాయస్థానముచే దానిని విడుదలచేయుటకుగాని, అప్పగించుటకు గాని ఉత్తరువు చేయబడననే తప్ప, ఈ అధ్యాయములోని పూర్వభాగము ననుసరించి కాక అన్యథా విడుదల చేయరాదు లేక అప్పగించ రాదు,

2[అధ్యాయము— 5 ]

శాసన విరుద్ధమైన అభిగ్రహణమును లేక నిరోధమునుగూర్చిన ఫిర్యాదులు

ఫిర్యాదులు చేయు అధికారము.

20. ఎవరేని వ్యక్తి కి ఈ చట్టము క్రింద తన పశువులు అభిగ్రహణముచేయబడినచో లేక అట్లు అభిగ్రహణముచేయబడి, ఈ చట్టమును ఉల్లంఘించి నిరోధింపబడినచో, ఆ అభిగ్రహణము చేయబడిన తేదీ నుండి పది దినముల లోపల ఎప్పుడైనను జిల్లా మేజిస్టేటుకు గాని, జిల్లా మేజిస్టేటు నిర్దేశము లేకుండ నేరారోపణలను గైని విచారణ చేయుటకు ప్రాధికారము పొందిన ఎవరేని ఇతర మేజిస్ట్రేటుకుగాని ఫిర్యాదు చేయవచ్చును.

ఫిర్యాదు చేయబడిన మీదట ప్రక్రియ.

21. ఫిర్యాదిచే స్వయముగాని పరిస్థితులను స్వయముగా ఎరిగియున్న ఏజెంటుచేగాని ఫిర్యాదు చేయబడవ లెను. ఫిర్యాదు (వాతరూపమునగాని, వాగ్రూపమునగాని ఉండవచ్చును. అది వాాగ్రూపమున ఈయబడినచో 'మేజిస్ట్రేటు దాని సారాంశమును (వాసి కొనవలెను,

ఫిర్యాదిని లేక అతని ఏజెంటును పరీక్షించినమీదట ఫిర్యాదుకు సరియైన ఆధారము గలదని విశ్వసించుటకు కారణమున్నట్లు మేజిస్టేటుకు తోచినచో, అతడు ఫిర్యాదుకు గురిమైన వ్యక్తిని సమను చెసి ఆ కేసును గూర్చి పరిశీలన జరుపవ లెను.

శాసన విరుద్దమైన అభిగ్రహాణమునకై లేక నిరోధమునకై నష్టపరిహారము

22. అభిగ్రహాణము లేక నిరోధము శాసన విరుద్దమైనదని న్యాయ నిర్ణయము చేయబడినచో, పశువులను విడుదల చేయించుకొనుటకు ఫిర్యాది చెల్లి౦చిన అన్ని జుర్మానాలు మరియు అతనికి అయిన అన్ని ఖర్చులతో సహ, ఆ అభిగ్రహణము లేక నిరోధము వలన కలిగిన నష్టమునకుగాను ఒక వంద రూపాయలకు మించకుండ యుక్తమైన నష్టపరిహారము అభిగ్రహణము చేసిన లేక పశువులను నిరోధించిన వ్యక్తిచే ఫిర్యాదికి చెల్లింపబడవలెనని మేజిస్ట్రేటు తీర్చు ఈయవలెను.

పశువులు విడుదల.

మరియు పశువులు విడుదల చేయబడియుండనిచో మేజిస్ట్రేటు, అట్టి నష్టపరివారమును ఇప్పించుటయే గాక వాటి విడుదలకు ఉత్తరువు చేసి ఈ చట్టము క్రింద వసూలు చేయదగు జుర్మానాలను మరియు ఖర్చులను పశువులను అభిగ్రహణము చేసిన లేక నిరోధించిన వ్యక్తి చెల్లించ వలెనని ఆదేశించవలెను. మూస:Rm


1. “ఇందు ఇటు పిమ్మట నిబంధనల ప్రకారం వాటిని పరిష్కరించవలెను”కు బదులుగా అనుకూలానుసరణ ఉత్తరువు, 1937 ద్వారా ఉంచబడినది

2. మూల అధ్యాయము 5 కు బదులుగా 1891 లోని 1వ చట్టము, పరిచ్చేదము 6 ద్వారా ఉంచబడినది.